ఓవర్సీస్ ప్రీమియర్ షో కలెక్షన్స్ లో అదరగొట్టిన రానా

చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో ఓ ముగ్గురు హీరోలు ఒకేరోజు వారి సినిమాలను రిలీజ్ చేశారు. వరుసగా హాలీడేస్ ఉండడంతో ఎలాగైనా చిత్రం మంచి వసూళ్లను రాబడుతుందని ఎవరి మార్కెట్ రేంఙ్ లో వారు భారీగా సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్ లో కూడా తెలుగు ప్రేక్షకులు వారికి ఇష్టమైన సినిమాను ప్రీమియర్ షో ద్వారా మొదటి ఆటకే చూడాగా ఒక్కొ సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ ను సాధించింది.

రానా “నేనే రాజు నేనే మంత్రి” $140,833 కలెక్షన్లను రాబట్టి మొదటి స్థానంలో నిలువగా.. నితిన్ “లై” $50,623 సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక చివరగా బోయపాటి దర్శకత్వం వహించిన “జయ జానకి నాయక” $8,535 లను సాధించి ఓవర్సీస్ ప్రీమియర్ షోలో పరవాలేదనిపించింది. మొదటి రోజు ఈ మూడు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ ను బాగానే రాబడుతున్నాయి. మరి రానున్న రోజుల్లో కూడా ఇదే ఊపును కొనసాగిస్తాయో లేదో చూడాలి.