ఓవర్సీస్లో పై చేయి సాదించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ !


గత శుక్రవారం విడుదలైన మూడు సినిమాల్లో రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఓవర్సీస్లో పూర్తిగా డామినేషన్ కనబరుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత రిలీజైన రానా సినిమా కావడం, భారీ స్థాయి ప్రమోషన్లు, సినిమాలో కంటెంట్ ఉండటం వలన ప్రీమియర్స్ నుండే మంచి కలెక్షన్లను రాబద్దటం మొదలుపెట్టిన చిత్రం మొదటిరోజు శుక్రవారం $1,50,000 డాలర్లను రాబట్టి శనివారం ఇంకాస్త మెరుగైన ప్రభావం చూపింది.

ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు శనివారం నాటికి సినిమా మొత్తం 3.82 లక్షల డాలర్లను వసూలు చేసింది. లాంగ్ రన్లో ఈ మొత్తం ఖచ్చితంగా హాఫ్ మిలియన్ కన్నా ఎక్కువే ఉండనుంది. ఇకపోతే ఏపి, తెలంగాణాల్లో సైతం కలెక్షన్లు చాలా బాగున్నాయి. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో ప్రేక్షకాదరణ పెరుగుతోంది. ఈ చిత్రంతో దర్శకుడు తేజాకు మంచి బ్రేక్ రావడమే కాక సోలో హీరోగా రానాకు మంచి కమర్షియల్ సక్సెస్ దక్కనుంది.