‘నేనే రాజు నేనే మంత్రి’ తమిళ, మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ !


రానా నటించిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ గత వారం విడుదలై మొదటిరోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లతో నడుస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు ఆగష్టు 11న తమిళం, మలయాళంలో కూడా రిలీజ్ చేయాలని రానా ముందుగానే ప్లాన్ చేశారు. ఆ మేరకే కొంత భాగాన్ని తమిళ నటులతో కూడా షూట్ చేశారు. కానీ కారాణాల తెలియలేదు కానీ 11న కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే విడుదలైంది.

మళ్లీ ఇప్పుడు రానా అండ్ టీమ్ పక్కాగా ప్లాన్ చేసి తమిళ, మలయాళ వెర్షన్లను సెప్టెంబర్ 8న రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అజిత్ యొక్క ‘వివేగం’ ఆగష్టు 24 న విడుదలైతే సెప్టెంబర్ 8 వరకు రెండు వారాల గ్యాప్ ఉంటుంది కనుక ఆ తేదీ అయితే వసూళ్ల పరంగా మంచిదని భావించి దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ‘బాహుబలి’ తో రానా ఇతర పరిశ్రమలకు బాగా పరిచయమవడం, చిత్ర ప్రమోషన్లు కూడా ప్రభావంతంగా ఉండటంతో అక్కడి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొని ఉంది.