లేటెస్ట్ : తిరుమల విచ్చేసిన డైరెక్టర్ కొరటాల NTR 30 గురించి ఏమన్నారంటే ?

Published on Jan 4, 2023 1:05 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 మూవీ అతి త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి అందరిలో మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచింది. ఇక ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీని 2024, ఏప్రిల్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా మొన్న మేకర్స్ ప్రకటించారు.

అయితే విషయం ఏమిటంటే నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దర్శకుడు కొరటాల శివ అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడారు. నేడు వేంకటేశ్వరుని దర్శనం ఎంతో బాగా జరింగిందని అన్నారు. అలానే తమ NTR 30 మూవీ పెద్ద సక్సెస్ కావాలని ఆయనని కోరుకునున్నాను, మీ అందరి ఆశీస్సులతో మూవీని ఫిబ్రవరి నుండి ప్రారంభించి, గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించిన అనంతరం పక్కాగా ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న థియేటర్స్ లోకి తీసుకువస్తాం అని తెలిపారు. కాగా NTR 30 మూవీ గురించి కొరటాల మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :