పవర్ఫుల్ గా ఎన్టీఆర్ ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్

Published on May 19, 2023 7:09 pm IST


టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నేడు ఈ మూవీకి దేవర అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ యూనిట్ ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతిలో ఆయుధంతో సముద్రంలో రాయి మీద నిలబడిన పవర్ఫుల్ లుక్ ని విడుదల చేసారు. ఈ లుక్ అదిరిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :