గ్రాండ్ గా లాంచ్ అయ్యిన అవైటెడ్ “ఎన్టీఆర్ 30”.!

Published on Mar 23, 2023 9:02 am IST


పాన్ వరల్డ్ సెన్సేషనల్ హిట్ “రౌద్రం రణం రుధిరం” చిత్రం తో అయితే ఆ సినిమాలో మరో హీరోగా నటించిన మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ గా భారీ రీచ్ సొంతం అయ్యింది. అయితే అది ఇంకా నెమ్మదిగా మొదలవుతున్న సమయంలోనే గత ఏడాదిలో ఎన్టీఆర్ తన కెరీర్ 30 వ సినిమాని అయితే దర్శకుడు కొరటాల శివ తో అనౌన్స్ చేసాడు.

దీనితో ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ హైప్ స్టార్ట్ అయ్యింది. నార్త్ ఆడియెన్స్ అటెన్షన్ ని కూడా తారక్ ఈ సినిమాతో అందుకోగా అక్కడ నుంచి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అయితే ఆ నందమూరి తారక రాముని ఆశీస్సులతో ఈరోజు హైదరాబాద్ లో లిమిటెడ్ ప్రముఖ గెస్టులతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

మరి ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ అలాగే తారక్ ముందు సినిమా చేసిన తన జక్కన్న రాజమౌళి నెక్స్ట్ కొరటాల తర్వాత చేయనున్న సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :