NTR30 బిగ్ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌లో పూనకాలే..!

NTR30 బిగ్ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌లో పూనకాలే..!

Published on May 19, 2022 9:31 PM IST


యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ కెరీర్‌లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు కావడంతో కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌కి బిగ్ అప్డేట్‌ని ఇచ్చారు మేకర్స్.

“ప్యూరీ ఆఫ్ ఎన్టీఆర్‌ 30” పేరుతో విడుదలైన ఈ టీజర్‌లో అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. “వస్తున్నా”.. అంటూ ఎన్టీఆర్‌ వాయిస్‌తో ఉన్న పవర్‌ ఫుల్‌ డైలాగ్ ఆకట్టుకుంది. దీనికితోడు వర్షంలో సముద్రపు అలలపై కదులుతున్న పడవల్లో రెండు చేతుల్లో ఎన్టీఆర్‌ కత్తి పట్టుకుని కనీకనిపించకుండా నిల్చున్న స్టిల్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంతో పాటు యువసుధ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందమూరి కళ్యాణ్ కళ్యాణ్ రామ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు