NTR 30 : ఆ ఇంట్రస్టింగ్ విషయాల పై క్లారిటీ వచ్చేది ఆరోజే?

NTR 30 : ఆ ఇంట్రస్టింగ్ విషయాల పై క్లారిటీ వచ్చేది ఆరోజే?

Published on Feb 18, 2023 9:00 AM IST

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీ NTR 30 పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎప్పటినుండో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు దీనిని నిర్మించనుండగా అనిరుద్ సంగీతం అందించనున్నారు. గతంలో జనతా గ్యారేజ్ మూవీతో ఎన్టీఆర్, కొరటాల కాంబో భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక తాజా మూవీ కోసం ఇప్పటికే కొరటాల ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనుందని, విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ కనిపించనుండగా ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే వార్తలు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. మరోవైపు ఈ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే రివెంజ్ డ్రామా అని కూడా కొందరు అంటున్నారు. మొత్తంగా ప్రచారం అవుతున్న ఇటువంటి ఇంట్రస్టింగ్ విషయాలపై పక్కాగా క్లారిటీ రావాలి అంటే ఫిబ్రవరి 24 వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది. కాగా ఆరోజున ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇక ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించి 2024 ఏప్రిల్ 4 న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు