లేటెస్ట్ : NTR 30 పై క్రేజీ బజ్

Published on Feb 14, 2023 11:11 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై భారీ స్థాయిలో రూపొందనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా మంచి హైప్ ఉంది. ఇక ఈ మూవీని ఈ నెలలోనే ప్రారంభించి వచ్చే నెలాఖరులో సెట్స్ మీదకు తీసుకెళతాం అని ఎన్టీఆర్ ఇటీవల అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తెలిపారు.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందట. హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారట యూనిట్. అయితే దీనిపై అఫీషియల్ గా ప్రకటన మాత్రం రావలసి ఉంది. కాగా ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించనుడగా ఇప్పటికే రిలీజ్ అయిన NTR 30 మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీని సమ్మర్ కానుకగా 2024 ఏప్రిల్ 4న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :