ఎన్టీఆర్ 30 మూవీ లాంచింగ్ వెన్యూ ఫిక్స్ ?

Published on Mar 22, 2023 2:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత స్థాయిలో కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ మూవీ తెరకెక్కనున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ మూవీగా రూపొందనున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుండగా అనిరుద్ దీనికి సంగీతం అందించనున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ మార్చి 23న గ్రాండ్ గా లాంచ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుండి అఫీషియల్ గా ప్రకటన వచ్చింది.

అయితే విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క లాంచింగ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని ఐటిసి కోహినూర్ హోటల్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ లాంచింగ్ ఈవెంట్ కి సంబంధించి పలు కార్యక్రమాలు ప్రారంభం కాగా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ భారీ యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా కొరటాల శివ తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని అలానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరిస్తుందని యూనిట్ చెప్తోంది.

సంబంధిత సమాచారం :