రేపటి నుండి ఎన్టీఆర్30 సినిమా షూటింగ్ ప్రారంభం!

Published on Mar 30, 2023 1:00 pm IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఎన్టీఆర్ 30. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయాల్సి ఉంది. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. హీరో ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం లో స్టంట్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ నిర్వహించడానికి హాలీవుడ్ నుండి కొంతమంది ప్రముఖ సాంకేతిక నిపుణులను టీమ్ తీసుకుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, ఈ సినిమా ఫైట్ సీక్వెన్స్‌తో రేపు షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ 30 ఇప్పటి వరకు తన బెస్ట్ వర్క్ అని కొరటాల శివ పూజా కార్యక్రమంలో అభిమానులకు హామీ ఇచ్చారు. తారక్‌కి వీరాభిమాని అయిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువ సుధ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకులు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :