ట్రెండ్ అవుతున్న “ఎన్టీఆర్ 30” ట్యాగ్..సినిమాపై లేటెస్ట్ బజ్ ఇదే.!

Published on Jan 16, 2022 1:53 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియన్ వైడ్ భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కి కూడా రెడీ అయ్యింది. అయితే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యాక యంగ్ టైగర్ తన నెక్స్ట్ రెండు భారీ సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

మరి తన కెరీర్ లో 30వ సినిమాగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల తో ప్లాన్ సినిమా సినిమా ఒకటి. అయితే ఈ సినిమా కోసం చాలా క్రేజీగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాపై ఏ చిన్న విషయం బయటకి వచ్చినా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండింగ్ లో పెట్టేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఈ సినిమా ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.

అయితే ఇదిలా ట్రెండ్ అవ్వడానికి లేటెస్ట్ బజ్ కారణం అయ్యింది. మరి అదేమిటంటే.. బహుశా ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరి నెలలోనే లాంచ్ అవుతుందని తెలుస్తుంది. అలాగే ఈ భారీ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ మరియు సంగీత దర్శకునిగా అనిరుద్ పేరులే ఫైనల్ అయ్యినట్టుగా వినిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ దెబ్బకి ఎన్టీఆర్ సినిమా పేరు అయితే ట్రెండింగ్ లో ఉంది.

సంబంధిత సమాచారం :