“ఎన్టీఆర్ 30” టార్గెట్ అప్పటికి.?

“ఎన్టీఆర్ 30” టార్గెట్ అప్పటికి.?

Published on Nov 9, 2022 4:00 PM IST

ఇప్పుడు టాలీవుడ్ నుంచి మంచి అంచనాలు నెలకొల్పుకొని రెడీ కానున్న మరో అవైటెడ్ భారీ చిత్రం ఎన్టీఆర్ 30వ చిత్రం. మరి దీనిని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనుండగా పాన్ ఇండియా వైడ్ ఎన్టీఆర్ భారీ రెస్పాన్స్ ని అయితే కొల్లగొట్టాడు. ఇక సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా రీసెంట్ అయితే మేకర్స్ సినిమా లైవ్ లోనే ఉన్నట్టుగా సాలిడ్ అప్డేట్ కూడా ఇచ్చారు.

ఇక త్వరలోనే సినిమా సెట్స్ మీదకి కూడా వెళ్లనుండగా సినిమా రిలీజ్ ఎప్పుడు అనే అంశం ఇప్పుడు తెలుస్తుంది. మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా కానుకగా టార్గెట్ పెట్టుకొని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. దీనితో అయితే ఎన్టీఆర్ 30 బ్లాస్ట్ వచ్చే ఏడాది దసరా నాటికి రెడీ అవుతుందని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ పతాకం పై ఈ చిత్రం తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు