ఎన్టీఆర్ మూవీ ఆలస్యానికి కారణం అదే ?

ఎన్టీఆర్ మూవీ ఆలస్యానికి కారణం అదే ?

Published on Aug 8, 2022 7:01 AM IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమా షూట్ ఆలస్యం కానుంది. కొరటాల శివ ఈ సినిమా కథలో చాలా మార్పులు చేస్తున్నారట. అలాగే, ఈ సినిమా ఆలస్యానికి మరో కారణం కూడా ఉంది. ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్ల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ నాలుగు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సూచించారు. అందుకే, అక్టోబర్ సెకండ్ వీక్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా చిత్రీకరణ పోస్ట్ ఫోన్ అయ్యింది. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ఈ సినిమాలో తన పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్. కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు