త్రివిక్రమ్ సినిమా కోసం లుక్ మారుస్తానంటున్న ఎన్టీఆర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజ్ చిత్రం ‘జై లవ కుశ’ ఈనెల 21న భారీ ఎత్తున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అందుకే తారక్ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓకే టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఒక విశేషాన్నిబయటపెట్టారు.

అదేమిటంటే త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తాను, ఆ లుక్ లోకి మారడం కోసం ఏవేం చేయాలో అన్నీ చేస్తాను అన్నారు. దీన్నిబట్టి త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపించనున్నారని అర్థమవుతోంది. ఈ ఏడాది ఆఖరున మొదలయ్యేలా కనిపిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది.