పొలిటికల్ ఎంట్రీ పై జూనియర్ కీ కామెంట్స్

Published on Mar 31, 2022 7:07 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన RRR చిత్రం భారీ హిట్ అయ్యింది. మరియు ఎన్టీఆర్ హిందీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో బిజీగా ఉన్నాడు. అంతేకాక తాజాగా తన పొలిటికల్ ఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సూటి ప్రశ్నకు స్పందించారు ఎన్టీఆర్.

తాను నటుడిగా అత్యుత్తమ దశలో ఉన్నానని, ప్రస్తుతం ఈ రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని ఎన్టీఆర్ చెప్పారు. మరో సెకనులో ఏం జరుగుతుందో తనకు తెలియనప్పుడు, భవిష్యత్తులో రాజకీయాల గురించి ఎలా అంచనా వేయగలనని అంటూ చెప్పుకొచ్చారు. నటుడిగా తాను ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రేమిస్తున్నానని, రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం లేదని క్లియర్ గా చెప్పారు. ఎప్పుడైతే ఏపీలో టీడీపీ పార్టీ స్పీడ్ తగ్గిందో, ఎన్టీఆర్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని, పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :