బాలీవుడ్‌లో ఆ దర్శకుడితో కలిసి పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఎన్టీఆర్

Published on Mar 29, 2022 4:53 pm IST


మన తరంలోని అత్యుత్తమ నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆర్‌ఆర్‌ఆర్‌ లో తన పాత్రకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న తీరు మనందరికీ కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ స్ట్రెయిట్ హిందీ సినిమా ఎప్పుడు చేస్తాడో చూడాలని అందరూ అనుకుంటున్నారు.

హిందీలో ఏ దర్శకుడితో పని చేయాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు, రాజ్‌కుమార్ హిరానీ తో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. హిరానీ రియలిస్టిక్ ఎమోషన్స్‌ని చాలా సరదాగా చూపించే విధానం తనకు చాలా నచ్చిందని ఎన్టీఆర్ చెప్పాడు. అలాగే సంజయ్ లీలా బన్సాలీ భారీ బడ్జెట్ చిత్రాలను చూడటం తనకు చాలా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పాడు.

సంబంధిత సమాచారం :