ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్ పై గర్వం వ్యక్తం చేస్తున్న తన నటి.!

ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్ పై గర్వం వ్యక్తం చేస్తున్న తన నటి.!

Published on Dec 24, 2022 7:02 AM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన లాస్ట్ భారీ హిట్ “రౌద్రం రణం రుధిరం” చిత్రం తో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎలాంటి క్రేజ్ ని తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తనకున్న టాలెంట్ తో అయితే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు కూడ ఎన్టీఆర్ కి రావచ్చనే మాట కూడా గట్టిగా వినిపిస్తుంది. మరి ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కి డెఫినెట్ గా గ్లోబల్ లెవెల్ క్రేజ్ వస్తుంది అని గట్టిగా చెప్పిన తన నటి అయితే ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ గుర్తింపు చూసి ఆనందం వ్యక్తం చేస్తుంది.

మరి ఆమె ఎవరో కూడా కాదు ఎన్టీఆర్ ప్లాప్ అండ్ క్లాసిక్ హిట్ సినిమా అయినటువంటి “ఊసరవెల్లి” సినిమా నటి పాయల్ ఘోష్. ఈ చిత్రం లో తమన్నా స్నేహితురాలిగా నటించిన ఈమె ఎన్టీఆర్ టాలెంట్ కి ఎప్పుడో పెద్డ ఫ్యాన్ అయ్యింది. మరి అలా RRR ఇంకా రిలీజ్ కాకముందే 2020లో ఈ సినిమా తో తారక్ డెఫినెట్ గా ఒక గ్లోబల్ ఫేస్ అవుతాడని చెప్పింది. మరి ఇప్పుడు అలాగే అవ్వగా తాను ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నేను అప్పుడు ఎన్టీఆర్ కోసం ఇలా అంటే చాలా మంది నవ్వారు, హేళన చేశారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఓ గ్లోబల్ ఫేస్ అయ్యాడు అంటూ తన విషయంలో గర్వం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. దీనితో ఈమె ట్వీట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు