టాక్..తారక్, బుచ్చిబాబు ల సినిమా కూడా ఈ తరహాలోనే??

Published on Jan 30, 2022 7:13 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ స్ధాయి అంచనాలు నెలకొన్న ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలు ఎంచుకుంటాడు అనే ప్రశ్న కి గాను సాలీడ్ లైనప్ తో సమాదానం అందించాడు. మరి ఈ లైనప్ లో ఆశ్చర్యకరంగా యాడ్ అయ్యిన పేరు మాత్రం లేటెస్ట్ దర్శకుడు బుచ్చిబాబు సాన అని చెప్పాలి.

అధికారికంగా ప్రకటన రాకపోయినా ఈ కాంబోలో సినిమా ఉందని మాత్రం కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి ఈ రెండు రోజులు నుంచి సినీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా ఈ సినిమా కోసం వినిపిస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమాపై మరొకటి వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా కూడా పీరియాడిక్ బాక్ డ్రాప్ లోనే ఉంటుందట. మరి ఎన్నేళ్ల కితం నాటి స్టోరీలా ఉంటుందో కానీ పక్కా రూరల్ నేపథ్యంలో పాతకాలపు స్టోరీ నే బుచ్చిబాబు తీసుకున్నాడట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా మొత్తం విజయనగరం సైడ్ డిజైన్ చేయబడిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :