టాక్..అక్కడి నేపథ్యంలో తారక్ – బుచ్చిబాబు ప్రాజెక్ట్..?

Published on Jan 28, 2022 10:00 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ నటించిన భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” కంప్లీట్ చేసి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా అనంతరం సాలిడ్ లైనప్ ని కూడా తారక్ రెడీ చేసి పెట్టుకున్నాడు. అయితే ఈ లిస్ట్ లో స్టార్ దర్శకులు ప్రశాంత్ నీల్ మరియు కొరటాల శివ పేర్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ ఈ లిస్ట్ లో మరో యంగ్ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సాన కూడా యాడ్ అయ్యాడని ఎప్పుడు నుంచో ఉన్న టాక్. కాకపోతే అధికారికంగా ఈ కాంబో ప్రకటన కాలేదు. మరి ఈ కాంబో లో సినిమాపై కూడా మంచి క్రేజ్ ఇప్పటికీ నడుస్తుండగా.. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రాన్ని బుచ్చిబాబు పూర్తిగా విజయనగర ప్రాంతం నేపథ్యంలో ప్లాన్ చేసాడట. సినిమా కథ అంతా అక్కడే తిరుగుతుంది అని తెలుస్తుంది. మరి ఈ సినిమాపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :