‘ఎన్టీఆర్ – చరణ్’ చెప్పడం పూర్తి చేశారట !

Published on Oct 4, 2021 8:00 am IST

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమ పాత్రలకు ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 7, 2022 న విడుదల కానుంది. ఇక ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటి సారి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి ఇండియా వైడ్ గా బజ్ ఉంది.

ఇక దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్, జీ5 కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ జీ5 లోనూ, హిందీ, కొరియన్, పోర్చుగీస్, టర్కిష్, స్పానిష్ వెర్షన్స్ నెట్ ఫ్లిక్స్ లోనూ రిలీజ్ కానున్నాయి.

సంబంధిత సమాచారం :