వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎన్టీఆర్, మహేష్ ల సహాయం!

Published on Dec 1, 2021 10:00 pm IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వర్షాల కారణంగా భారీ మొత్తం లో ప్రజలు నష్టాన్ని చవి చూశారు. ఈ మేరకు వారు సహాయం చేసేందుకు గానూ సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ ఎత్తున విరాళం అందించారు.

జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా. ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల సంభవించిన వరదల వలన ప్రభావితం అయిన ప్రజల కష్టాలను చూసి చలించి, వారు కోలుకోవడానికి ఒక చిన్న చర్య గా 25 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వినాషకరమైన వరదల దృష్ట్యా, సీఎం రిలిఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయలు అందించాలి అని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీ కి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నా అని తెలిపారు.

సంబంధిత సమాచారం :