RRR – తారక్, చరణ్ లలో ఒకరి నటినకి ఒకరి అభిమానులు ఫిదా..!

RRR – తారక్, చరణ్ లలో ఒకరి నటినకి ఒకరి అభిమానులు ఫిదా..!

Published on Mar 25, 2022 8:40 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఎట్టకేలకు ఈరోజు విడుదల అయ్యి భారీ హిట్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఇలాంటి చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలను దర్శకుడు రాజమౌళి ఎలా బ్యాలన్స్ చేస్తారు అనే ప్రశ్న మొదటి నుంచి ఎంతో తొలచి వేస్తూ వస్తుంది.

మరి ఈ ప్రశ్న ఎట్టకేలకు సమాధానంతో తిరిగి వచ్చింది. అయితే మొదటిలో ఎక్కడి వరకు ఎందుకు నిన్న సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా కొంతమంది ఇద్దరు హీరోల అభిమానుల్లో కూడా క్రెడిట్స్ అని ఇతర అంశాల్లో అలా రచ్చ నడుస్తూ వచ్చింది.

కానీ వారంతా సినిమా చూసాక మాత్రం రాజమౌళి టేకింగ్ ఎవరికీ ఓ హీరో మీద ఇంకో అభిమానికి మాట రానివ్వకుండా చేసింది. దీనితో ఎన్టీఆర్ ఫాన్స్ చరణ్ పైన చరణ్ అభిమానులు తారక్ పైన తమ ప్రశంసలు కురిపిస్తూ ఒకరి మీద ఒకటి లైఫ్ టైం పెర్ఫామెన్స్ లను కొనియాడుతున్నారు. ఇలా ఇద్దరి హీరోల అభిమానులు తమ కో హీరో నటనకి ఫిదా అయ్యిపోయి చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు