చరణ్‌ – తారక్‌ ఎంట్రీ గ్రాండ్‌ గా ప్లాన్ చేశారట !

Published on Dec 19, 2021 3:27 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఈ భారీ చిత్రం ఈవెంట్‌ ను ఈ రోజు సాయంత్రం ముంబయిలో భారీగా ప్లాన్‌ చేసింది టీమ్. ఈ వేడుక కోసం ఇప్పటికే రామ్‌చరణ్‌, తారక్, ఇతర చిత్ర బృందం ముంబయి చేరుకుంది.

అయితే, ఈ ఈవెంట్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ – తారక్‌ ల ఎంట్రీని గ్రాండ్‌ లెవల్‌లో ప్లాన్‌ చేశారట. అలాగే బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. ఇక కరుణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :