నెంబర్ 1 పొజిషన్ లో తారక్, సామ్ ల ప్రోమో.!

Published on Oct 12, 2021 2:02 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమినీ ఛానెల్లో “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే గ్రాండ్ రియాలిటీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. వారం వారంకి కూడా తారక్ తన పెజెన్స్ తో మంచి రేటింగ్ ని అందిస్తూ షో ని ముందుండి నడిపిస్తున్నాడు. అయితే మరి సామాన్యులతో పాటు పలువురు సినీ తారలు కూడా వస్తున్న ఈ షోలో తాజాగా స్టార్ హీరోయిన్ సమంతా రావడం జరిగింది.

ఆల్రెడీ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ గ్రాండ్ రియాలిటీ షో ఆ స్పెషల్ ఎపిసోడ్ తాలూకా ప్రోమోని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మంచి ఎంటర్టైనింగ్ గా కట్ చేసిన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో 2.2 మిలియన్ కి పైగా వ్యూస్ తో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ కే ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేసిన మరో అదిరే ఎపిసోడ్ కి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అలాగే సామ్ ఎపిసోడ్ ని దసరా స్పెషల్ గా టెలికాస్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :