‘అరవింద సమేత’ నుంచి మరో పిక్ లీక్ !

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ జూ ఎన్టీఆర్ కలయికలో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి సంబంధించి లొకేషన్ స్టిల్స్ లీక్ అవ్వడం చిత్రబృందాన్ని కలవర పెడుతొంది. ఈ మధ్య ఎన్టీఆర్, నాగబాబుకు సంబంధించి ఓ ఎమోషనల్ సన్నివేశంలోని ఓ లొకేషన్ స్టిల్ లీక్ అయింది. దాంతో చిత్రబృందం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నప్పటికీ తాజాగా ‘అరవింద సమేత’ నుండి మరో లొకేషన్ ఫోటో మళ్లీ లీక్ అయింది.

కాగా ఈ చిత్ర టీజర్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.