‘అరవింద సమేత’ టీజర్‌ విడుదలయ్యే టైం లాక్ అయింది

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం టీజర్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారని తెలిసిన విషయమే. ఐతే తాజాగా టీజర్ ను ఆ రోజు ఎన్ని గంటలకు రిలీజ్ చేయనున్నారో కూడా రివీల్ చేసింది చిత్రబృందం. కరెక్ట్ గా ఆగష్టు 15న ఉదయం 9 గంటలకు టీజర్ ను విడుదల చేయనున్నారు.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొనే త్రివిక్రమ్ టీజర్ ను కట్ చేస్తున్నారట. ముఖ్యంగా ఎన్టీఆర్ ను ఎలివేట్ చేసే షాట్స్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చుతాయని తెలుస్తోంది.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.