‘జై లవ కుశ’ సినిమాపై వస్తున్నవన్నీ పుకార్లేనన్న టీమ్ !


ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తుండటం అందులో ఒకటి ప్రతి నాయకుడి పాత్ర కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. పైగా ‘జై, లవ’ పాత్రల లుక్స్ ఇంప్రెసివ్ గా ఉంటడటం, టీజర్ అకట్టుకోవడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అందుకే టీమ్ చెప్పిన తేదీకే సినిమాను రిలీజ్ చేయడానికి తీరిక లేకుండా పనిచేస్తోంది.

కానీ గత రెండు మూడు రోజులుగా మీడియాలో సినిమా ముందు చెప్పినట్టు సెప్టెంబర్ 21న రిలీజ్ కావడంలేదని, అందుకు కారణం మూడు పాత్రలపై షూటింగ్ ఆలస్యమవడం, ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టీవీ షో అని వార్తలొచ్చాయి. దీంతో అభిమానుల్లో కాస్త కంగారు మొదలైంది.

దీన్ని గమనించిన నిర్మాణం సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అవన్నీ ఒట్టి పుకార్లేనని, విడుదలలో ఎలాంటి ఆలస్యం ఉండదని, ముందుగా చెప్పినట్టు సెప్టెంబర్ 21న విడుదల ఖాయమని మరోసారి బల్లగుద్ది చెప్పింది. అలాగే ఇంకొన్ని రోజుల్లో లవ పాత్ర తాలూకు టీజర్ కూడా వస్తుందని స్పష్టం చేసింది. దీంతో అన్ని పుకార్లకు బ్రేక్ పడింది.