ఐపిఎల్ బ్రాండ్ అంబాసిడర్ గా తారక్ !

ఇంకొద్దిరోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. దీని కోసం క్రికెట్ ప్రేమికులంతా కళ్ళలో ఒత్తులేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే స్టార్ టీవీ ఈ ఐపీఎల్ సీజన్ ను టెలికాస్ట్ చేయనుంది. ఇందుకోసం ఒక్కో స్థానిక భాషకు ఒక్కొక స్టార్ సెలబ్రిటీని ప్రమోషన్ల నిమిత్తం ఎంచుకుంది స్టార్ టీవీ.

అందులో భాగంగా తెలుగు తరపున ఎన్టీఆర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నిర్ణయించారు. ఇందుకోసం తారక్ త్వరలో ఐపీఎల్ కు సంబందించిన టీవీ ప్రకటనల చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ గతంలో స్టార్ మాతో కలిసి తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.