మరో అవార్డును కైవసం చేసుకున్న జూ. ఎన్టీఆర్ !


టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను వరుస అవార్డులు వరిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఆయన కనబరచిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్న ఆయన తాజాగా ప్రకటించబడిన ‘శంకరాభరణం’ అవార్డుకి కూడా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు.

సీనియర్ నటి తులసి దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాధ్ గారి పేరు మీద ఈ ఆవార్డ్సును నెలకొల్పారు. ఈ అవార్డుల మొదటి విడత ప్రకటనలో ఎన్టీఆర్ తో పాటు హిందీ నుండి ఉత్తమ నటుడిగా అమీర్ ఖాన్(దంగల్), ఉత్తమ నటిగా ‘అలియా భట్’ (ఉడ్తా పంజాబ్) లు ఎంపికవగా తమిళ పరిశ్రమ నుండి ఉత్తమ దర్శకుడిగా ధనుష్ (పా.పాండి), మలయాళం నుండి ఉత్తమ నటుడిగా దుల్కర్ సల్మాన్ ఎంపికయ్యారు. జూన్ 20వ తేదీన హైదరాబాద్లో ఈ అవార్డుల వేడుక జరగనుంది.