మిర్చి మ్యూజిక్ అవార్డుల్లో ఎన్టీఆర్ సత్తా!

ntr
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనలోనే కాక, పాటలు పాడడంలోనూ చాలా టాలెంటెడ్ అని చాలా సార్లే నిరూపించుకున్నారు. గతంలో ఎన్టీఆర్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యి, సింగర్‌గానూ ఆయనకో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఈ ఏడాది ఆయన పాడిన ‘ఫాలో ఫాలో’, ‘గెలయా గెలయా’ అన్న పాటలు సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా, తాజాగా అవార్డులను కూడా తెచ్చిపెట్టాయి. రేడియో మిర్చి సంస్థ ఏటా నిర్వహించే మిర్చి మ్యూజిక్ అవార్డుల్లో భాగంగా ఈ రెండు పాటలకు ఎన్టీఆర్, ‘స్టార్ యాజ్ సింగింగ్ సెన్సేషన్‌’గా రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు.

ఎన్టీఆరే హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’లో ఫాలో ఫాలో అనే పాట ఉండగా, ‘గెలయా గెలయా’ అన్న పాట కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా పాడారు. ఇక ఈ రెండు పాటలకూ ఇప్పడు అవార్డులు రావడం విశేషంగా చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం హైద్రాబాద్‌లో జరిగిన అవార్డు వేడుక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ విషయానికి వస్తే, సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.