ఎన్టీఆర్ బయోపిక్ పై సినిమా రేపే ప్రారంభం!

11th, November 2017 - 04:04:36 PM

ఎన్టీఆర్ బయోపిక్ మీద రాంగోపాల్ వర్మ ఒక సినిమా అనౌన్స్ చేసాడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో తెరకెక్కనుంది ఈ సినిమా. డైరెక్టర్ తేజ కూడా ఎన్టీఆర్ బయోపిక్ మీద సినిమా చేయబోతున్నాడు. జనవరి 18 (ఎన్టీఆర్ వర్ధంతి) రోజున సినిమా ప్రారంభం కానుంది. బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు మరో సినిమా ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా తెరకెక్కబోతోంది.

తమిళనాడు తెలుగు యువశక్తి అద్యేక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ పేరుతో సినిమా ప్రారంభించబోతున్నాడు. రేపు (నవంబర్ 12) ఉదయం ఎన్టీఆర్ గార్డెన్స్ లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుకానుంది. సినిమాకు సంబంధించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.