ఎన్టీఆర్ పోస్టర్ విడుదల చేసిన దర్శకుడు తేజ !

18th, January 2018 - 10:16:51 AM

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న సినిమా ఎన్టీఆర్. నందమూరి తారకరామారావ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంభందించి ఫస్ట్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ నాడు పార్టి లో ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు దర్శకుడు తేజ.

బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు విష్ణు ఇందురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మర్చి నుండి మొదలుకానుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంభందించి నటినటులు ఎంపిక జరుగుతోంది. కోట్ల మంది హృదయాల్లో సుస్తితస్థానం ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ బయోపిక్ పై ఇటు సినీ పరిశ్రమలో, అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.