
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘టెంపర్’ విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది, సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆత్రుత అభిమానులలో ఎక్కువవుతుంది. దానికి తగ్గట్లుగా సినిమాపై రోజుకొక పాజిటివ్ ఫీలర్ బయటకొస్తుంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రచయిత వక్కంతం వంశిలు తీర్చిదిద్దిన ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ సినిమాకు పెద్ద హైలైట్. చాలా రోజుల తర్వాత నటుడిగా తన ప్రతిభకు పరీక్ష పెట్టె పాత్ర రావడంతో, యంగ్ టైగర్ అద్బుతంగా నటించాడు. అని చిత్ర బృందం చెప్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ దయ క్యారెక్టర్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడట. అలాగే, ‘టెంపర్’ టైటిల్ సాంగులో ఇరగదీసి డాన్స్ చేశాడు. ‘యమదొంగ’లో ‘నాచోరే.. నాచోరే..’ తరహాలో కుమ్మేశాడట. ఈ వార్తలు అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఫిబ్రవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.