బిగ్ బాస్ షో కోసం ఎన్టీఆర్ కు భారీ పారితోషకం
Published on Jun 14, 2017 11:52 am IST


బిగ్ బాస్ షో తో ఎన్టీఆర్ తొలిసారి టివి కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయడంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో రానున్న ఈ షో కోసం అంతటా ఆసక్తి నెలకొని ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ షో ద్వారా ఎన్టీఆర్ కు భారీ మొత్తంలో పారితోషకం అందనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక ఎపిసోడ్ కి మాత్రమే ఎన్టీఆర్ రూ. 50 లక్షలు ఛార్జ్ చేయనున్నట్లు సమాచారం. ఇతర భాషల్లో బాగా ప్రచారం పొందిన బిగ్ బాస్ షోని ఎన్టీఆర్ తెలుగులో చేయనుండడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ్ లో ఈ షోని కమల్ హాసన్ చేస్తున్నారు.

 
Like us on Facebook