ఎన్టీఆర్ – చరణ్ కలయిక ఆ దేవుడు నిర్ణయించాడు !

Published on Dec 20, 2021 9:10 am IST

దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం..రణం..రుధిరం’ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ భారీ చిత్రం ఈవెంట్‌ నిన్న ముంబయిలో ఘనంగా జరిగింది. కాగా ఈ వేడుక కోసం బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ ముఖ్య అతిధిగా వచ్చాడు.

అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘రామ్‌ చరణ్‌ అభిమానులందరికీ స్వాగతం. చరణ్‌ తో తన కాంబినేషన్‌ ను ఉద్దేశించి మాట్లాడుతూ… బహుశా ఈ కలయిక ఆ దేవుడు నిర్ణయించాడేమో. రామ్‌ అంటే తారక్‌. చరణ్‌ అంటే రామ్‌ చరణ్‌. అందుకే రామ్‌చరణ్‌ అభిమానులందరికీ స్వాగతం అని పలికాను’’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :