RRR కోసం ఏకంగా 75 టికెట్ల‌ను కొనుగోలు చేసిన ఎన్టీఆర్ వీరాభిమాని..!

Published on Mar 5, 2022 9:30 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ వీరాభిమాని ఒకరు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ ఇప్పటికే ప్రారంభం కాగా, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తాజాగా అమెరికా డల్లాస్‌ నగరంలోని గెలాక్సీ థియేట‌ర్‌లో ఎన్టీఆర్‌ వీరాభిమాని ఒకరు ఏకంగా 75 టికెట్లను కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురిచేశాడు. దీనిని బట్టి చూస్తుంటే తార‌క్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంత‌గా ఎదురుచూస్తున్నారో అర్థ‌మ‌వుతుంది. ఇదిలా ఉంటే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :