పూరి సినిమాకి డేట్ ఫిక్స్ చేసిన ఎన్.టి.ఆర్

ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆగష్టు 1న లాంఛనంగా ప్రారంభమైంది. ఆగష్టు 2 నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. కానీ ఎన్.టి.ఆర్ ఇంకా ఈ సినిమా టీంతో జాయిన్ అవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ ఆగష్టు 11 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ కథని అందించాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన మూడవసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. మధురిమ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 2015 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇది కాకుండా ఎన్.టి.ఆర్ నటించిన ‘రభస’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version