“కెజిఎఫ్” డైరెక్టర్‌కి పార్టీ ఇచ్చిన తారక్.. ఫోటోలు వైరల్..!

Published on May 6, 2022 3:00 am IST


కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “కేజీఎఫ్ కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం “కేజీఎఫ్ 2”. ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు టాప్ మోస్ట్ నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో “సలార్” చేస్తూనే మరోపక్క తారక్ ప్రాజెక్ట్ ప్రకటించడం జరిగింది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్… కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి పార్టీ ఇచ్చాడు. మే 5వ తారీకు ఎన్టీఆర్ పెళ్లి రోజు కావడంతో ప్రశాంత్ నీల్ దమతులకు ఎన్టీఆర్ పార్టీ ఇచ్చారు. దీంతో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుత త్వరగా సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లండి అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్… కొరటాల శివ ప్రాజెక్టు చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయినా వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :