కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ కొత్త కసరత్తులు !

Published on May 23, 2022 8:30 am IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో తన లుక్ కోసం ఇప్పటికే ఎన్టీఆర్ కసరత్తులు స్టార్ట్ చేశాడు. ఆల్ రెడీ ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం తారక్ రఫ్ లైక్ లో ఫుల్ గడ్డంతో కనిపిస్తాడట.

కాగా జూలై రెండవ వారం నుండి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అన్నట్టు 2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :