తారక్ సినీ కెరీర్ ఇప్పుడు టాప్ స్పీడ్ లో వెళుతుంది. టెంపర్ దగ్గర నుండి ఎన్టీఆర్ సినిమా సెలక్షన్ పూర్తిగా మారిపోయింది. వరస హిట్స్ సాధిస్తూ దూసుకొనిపోతున్నాడు, అరవింద సమేత హిట్ తరవాత రాజమౌళి దర్శకత్వంలోఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమాని లైన్ లో పెట్టాడు, ఆ తర్వాత కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ని విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకోవాలి. అసలు త్రివిక్రమ్ తో మూవీ అప్డేట్ రాకముందే, ప్రశాంత్ నీల్ తో సినిమా వార్త రాకముందే, ఎన్టీఆర్ సంజయ్ దత్ కి,కెజిఫ్ హీరో యష్ కి తన ఇంట్లో స్పెషల్ పార్టీ ఇచ్చినట్లు అప్పట్లోనే గుసగుసలు వినవచ్చాయి.
కెజిఫ్ 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సమయంలో తారక్ ఆ ఇద్దరినీ తన ఇంటికి పిలిచి విందు ఇచ్చినట్లు తెలుస్తుంది. దానివలన వాళ్లతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతోనే తన తర్వాతి సినిమాలో సంజయ్ దత్ ని ఎలాగైనా నటింపచేయాలని తారక్ గట్టిగా భావిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తో ఎలాగూ పాన్ ఇండియా స్టార్ అవుతాడు, తర్వాతి సినిమాలో సంజయ్ దత్ ఉంటే బాలీవుడ్ లో ఇంకా క్రేజ్ పెరుగుతుంది. ఆ తర్వాత కెజిఫ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయినా ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తే అది పాన్ ఇండియా ఫిల్మ్ అవుతుంది, కన్నడలో ఎలాగూ ఎన్టీఆర్ కి విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ వుంది. పైపెచ్చు యష్ కూడా సపోర్ట్ చేస్తాడు. దీనితో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగటానికి చాలా అవకాశాలు వున్నాయి.. ఈ ఎపిసోడ్ మొత్తని గమనిస్తే ఎన్టీఆర్ ముందుచూపుకి ఫిదా కావాల్సిందే..!
