బిగ్ బాస్ షోను రక్తి కట్టించిన తారక్ !

23rd, July 2017 - 06:37:33 PM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా మారి చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో యొక్క నిన్నటి ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్లో ఎవరు షో నుండి బయటకు వెళతాతో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని ఎపిసోడ్లలో నిన్నటి ఎపిసోడ్ అంతలా హిట్ అవడానికి కారణం ఎన్టీఆర్ హోస్టింగ్ స్కిల్స్ అనే చెప్పొచ్చు.

షోలో ఉన్న 12 మంది కంటెస్టెంట్ల ఎమోషనల్ ఫీలింగ్స్ ను బేస్ చేసుకుని ఎన్టీఆర్ షోను ముందుకు నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ చూపించిన హోస్టింగ్ స్కిల్స్ కు నిన్న మొన్నటి వరకు పర్వాలేదంతే అనుకున్న చాలా మంది బుల్లి ప్రేక్షకులు భలేగా చేశాడు అంటూ కితాబులిస్తున్నారు. ఎన్టీఆర్ ఇలాగే విజృంభిస్తే షో బంపర్ హిట్టై ఛానెల్ టీఆర్ఫీ రేటింగ్స్ భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.