ఆద్యంతం అలరించిన ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ !
Published on Jul 17, 2017 8:48 am IST


ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు షో మొదటి సీజన్ నిన్న సాయంత్రం నుండి ప్రారంభమైంది. 70 రోజుల పాటు జరగబోయే ఈ షోను అన్ని హంగులతో గ్రాండ్ గా తీర్చిదిద్దారు. ఇక హోస్టుగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ కూడా సరికొత్తగా కనిపిస్తూ షోను ఆద్యంతం కనుల విందుగా తీర్చిదిద్దారు. తన ఎనర్జిటిక్ మాటలతో, జోకులతో ఒక్కొక్క కంటెస్టెంటును ఆహ్వానించిన తారక్ ఏమాత్రం గ్యాప్ లేకుండా మాట్లాడుతూ ప్రేక్షకుల్ని అలరించారు.

బాలీవుడ్లో అంత పెద్ద హిట్టైన బిగా బాస్ ను తెలుగులో చేస్తే ఎలా ఉంటుందో అని అనుమానపడిన బుల్లితెర ప్రేక్షకులు కూడా నిన్న సాయంత్రం షో పట్ల, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పట్ల సోషల్ మీడియాలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు షో తర్వాతి ఎపిసోడ్ల నుండి మొదలుకానుంది. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారంకానుంది.

 
Like us on Facebook