హిట్ దర్శకుడితో ఎన్టీఆర్ ?
Published on Nov 4, 2017 1:33 pm IST

ఈ మద్య దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబడుతున్నాయి. తాజాగా ఈ బ్యానర్ లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకొని కలెక్షన్స్ పరంగా బాగుంది. ప్రస్తుతం దిల్ రాజు నాని తో ‘ఎంసిఎ’ రాజ్ తరుణ్ తో ‘లవర్’ సినిమాలతో పాటు మహేష్ బాబు & వంశి పైడిపల్లి కాంబినేషన్ లో మరో సినిమా నిర్మిస్తున్నాడు.

‘శతమానం భవతి’ సినిమాతో సక్సెస్ లో ఉన్న దర్శకుడు ‘సతీష్ వేగేశ్న’ ఆ సినిమా తరువాత సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో చెయ్యబోతున్నాడు. ఈ సినిమాకు ‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్ రిజిస్టర్ చేసారు. ఈ ప్రాజెక్ట్ లో ముందు నాగార్జున నటిస్తాడని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తాడని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించే వరుకు వేచి చూడాల్సిందే.

 
Like us on Facebook