ఇప్పటివరకు నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్ ‘ఎన్టీఆరే’ – బాలీవుడ్ స్టార్

Published on Jun 27, 2022 8:00 pm IST

బాలీవుడ్ స్టార్ విద్యుత్ జమ్వాల్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యాక్షన్ హీరోలలో ఒకరు. విద్యుత్ జమ్వాల్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ఖుదా హఫీజ్ 2తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే, విద్యుత్ జమ్వాల్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌ కు వచ్చాడు.

తన సినిమా గురించి వివరిస్తూనే.. విద్యుత్ తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా సుదీర్ఘంగా మాట్లాడారు.ముఖ్యంగా విద్యుత్ ఎన్టీఆర్ గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ పై విద్యుత్ మాటల్లోనే.. ‘ఎన్టీఆర్ ఇప్పటివరకు నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్’ అని ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.

అలాగే, విద్యుత్ జమ్వాల్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉన్నాను. ఆయన టాలెంట్ అంటే నాకు చాలా ఇష్టమని విద్యుత్ వెల్లడించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కొత్త సినిమాకి ప్రిపేర్ అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :