కేరళ వరద భాదితులకు ‘నందమూరి హీరోలు’ సాయం !

కేరళలో గత 10రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద భాదితులకు సహాయార్ధం కొరకు మన స్టార్ హీరోలు తమ వంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించగా తాజాగా నందమూరి హీరోలు కూడా విరాళాలు ప్రకటించి తన సేవా దృక్పధాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేర‌ళలోని వరద బాధితుల‌కు సాయంగా రూ.25 ల‌క్ష‌ల్ని ప్ర‌క‌టించగా ఆయన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కూడా పది లక్షల రూపాయిలను ప్రకటించి తమ అభిమానాలకు ప్రేరణగా నిలిచారు.