ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో కాసింత ఎక్కువగానే పొలిటికల్ టచ్..!

Published on Jan 30, 2022 3:00 am IST

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ కొర‌టాల శివ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కాసింత ఎక్కువగానే పొలిటికల్ టచ్ ఉండబోతుందట. అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ బ‌స్తీలో చదువుకున్న స్టూడెంట్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడట. రాజ‌కీయ నాయ‌కులు వ‌ల్ల విద్యార్థుల చ‌దువుకు ఆటంకం ఏర్ప‌డితే అప్పుడు వారికి అండ‌గా ఎన్టీఆర్ నిల‌బ‌డి పోరాటం చేసేశాడ‌నేదే ఈ సినిమా క‌థ అని టాక్‌.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌-కొర‌టాల శివ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూపర్ హిట్ కాగా, ఆ సినిమాలోనూ ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించారు. కాకపోతే అందులో ప్ర‌కృతి కోసం పోరాడే విద్యార్థి నాయ‌కుడిగా ఎన్టీఆర్ క‌నిపించారు. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :