మహానాయకుడు ముగింపు కూడా ఆమెతోనే !

రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘మహానాయకుడు’ సిద్ధంగా ఉన్నాడు. అలాగే మరో మూడు గంటల్లో ప్రీమియర్ షో మొదలు కానుంది. సినిమా రిజల్ట్ రాత్రి తొమ్మిది గంటలకు కల్లా తెలియనుంది. అయితే ‘కథానాయకుడు’లో కథ బసవతారకంగారి పాత్రను పోషించిన విద్యాబాలన్ పాయింటాఫ్ వ్యూలో మొదలవుతుంది. అలాగే ‘మహానాయకుడు’ కథ ముగింపు కూడా బసవతారకంగారి పాత్ర పాయింటాఫ్ వ్యూలోనే ఎండ్ అవుతుందని తెలుస్తోంది.

ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం ‘మహానాయకుడు’ ఫైనే ఆశలన్నీ పెట్టుకుంది.

కాగా కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ తో పాటు, వారాహి ప్రొడక్షన్స్ మరియు విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీన మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Exit mobile version