టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.
కాగా చిత్రబృందం ఈ రోజు నుండి ‘మహానాయకుడు’ షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం సారధి స్టూడియోలో షూటింగ్ జరిగుతుంది. బాలయ్య – విద్యాబాలన్ మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ బయోపిక్‌లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను పిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నాయి.
