ఇండియన్ సినిమా ప్రైడ్ ఎన్టీఆర్..దేశ వ్యాప్తంగా తారక్ నామ స్మరణ.!

ఇండియన్ సినిమా ప్రైడ్ ఎన్టీఆర్..దేశ వ్యాప్తంగా తారక్ నామ స్మరణ.!

Published on Aug 14, 2022 7:02 AM IST

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దాని తర్వాత ప్రపంచ స్థాయిలో భారీ లెవెల్ కి వెళ్లిన చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు మరోసారి ఇండియన్ వైడ్ సెన్సేషన్ గా మారింది.

అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్రముఖ మ్యాగజైన్ వెరైటీ వారు తమ ప్రిడిక్షన్ గా ఈ సినిమా నుంచి బెస్ట్ యాక్టర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా ఆస్కార్ అవార్డ్స్ కి ఎన్టీఆర్ వెళ్తాడాని పొందుపరిచారు. దీనితో ఈ అంశం సెన్సేషనల్ గా మారింది.

అలాగే ఇలాంటి అపారమైన గుర్తింపు తో ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ఇండియా మొత్తం ఓ రేంజ్ లో మారు మొగుతుంది. మరి వారు ఊహించినట్టుగా ఎన్టీఆర్ కి ఈ ఘనత అందితే మాత్రం తెలుగు సినిమాకి అంతకు మించిన బహుమతి ఇంకొకటి ఉండదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు